గవర్నర్ ను కలవనున్న పవన్

 

తిత్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది.ముందుగా అప్రమత్తం అవ్వటంతో పెద్దగా ప్రాణ నష్టం అయితే జరగలేదుగాని ఆయా ప్రాంతాల్లోని వారు సర్వం కోల్పోయి నిర్వాసితులయ్యారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించి భాదితులను పరామర్శించారు.పర్యటన సందర్బంగా ప్రభుత్వం భాదితులను ఆదుకోవడంలో విఫలం అయిందని విమర్శలు గుప్పించింది తెలిసిందే.తాజాగా పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావంపై విన్నవించేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు.

సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో పవన్ భేటీ కానున్నారు.తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు ,భాదితుల కష్టాలను గవర్నర్ కు వివరించనున్నారు.వీలైనంత త్వరగా బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.ఇదిలా ఉంటే ప్రభుత్వం చేప్పట్టిన చర్యలను గవర్నర్ ప్రశంసించారు.ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.