కరువులు కావాలనే సృష్టించారు.. సీమపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు

 

రాయలసీమలో జనసేన ఆత్మీయ యాత్ర ప్రారంభించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రైల్వేకోడూరులో రైతులతో సమావేశమయ్యారు పవన్. జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ సీఎంలా ప్రవర్తిస్తే గౌరవిస్తానన్నారు పవన్ కళ్యాణ్. కొద్ది మందికే సీఎంలా వ్యవహరిస్తే జగన్ రెడ్డి అనే అంటానని చెప్పారు. సీఎం జగన్ పద్ధతి మార్చుకోవాలని అప్పుడే తాను గౌరవిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడటం తగదన్నారు. రాయలసీమలో కరువులు కావాలనే సృష్టించారని మండిపడ్డారు పవన్. కొందరు బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. సీమలో కరువు నాయకుల వల్లేనని ఆరోపించారు పవన్. ఎంతమంది సీఎంలు ఇక్కడి నుంచి వచ్చినా పరిస్థితులను మార్చలేదన్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో దొంగలు దొరికిన కాడికి దోచుకున్నారు. ఆయన్ను చూసేందుకు ఎయిర్ పోర్టు దగ్గరకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పవన్ బయటకు వస్తున్న సమయంలో ఆయన చూసేందుకు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో అదే అదునుగా భావించిన దొంగలు కార్యకర్తల ముసుగులో చేతివాటం చూపించారు. జనసేన కార్యకర్తల పర్సులు, ఫోన్లు, బంగారు చైన్లు కొట్టేశారు. దీంతో జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమయ్యాయి.

ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టు దగ్గర జనసేన కార్యకర్తల నిరసన తెలిపారు. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను ఖండించారు. స్త్రీ జాతి రక్షణకు జనసేన అండగా ఉంటుందన్నారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు.