మా నాన్న పోలీస్..అయినా మా అక్కను వేధించారు

అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ తరుణంలో తన చిన్నపుడు జరిగిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మా నాన్న పోలీస్..మా అక్క రోడ్డు మీద వెళుతుంటే ఏడిపించారు. అప్పుడు నాకు వాళ్లను చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఆడవాళ్లు బయటకు వెళితే, ఇలాంటి వేధింపులు తప్పవా..? ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన అప్పటి నుంచే నా మనసులో ఉండిపోయిందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే, విద్యార్ధినుల ఆత్మగౌరవాన్ని అవమానించన వారెవరైనా, వారిని కొట్టినా, తిట్టినా కేసులు ఉండకుండా చేస్తామని హామీ ఇచ్చారు.