స్పెషల్ స్టేటస్ వల్ల నాకు సైటొచ్చింది

స్పెషల్ స్టేటస్ రిపోర్ట్ చదివి చదివి నాకు సైటు కూడా వచ్చిందన్నారు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. అనంతపురంలో జరుగుతున్న సీమాంధ్రహక్కుల చైతన్య సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేశారు. దీని గురించి ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతూ ఎప్పుడూ లేనిది ఆయన కళ్లజోడుతో కనిపించారు. దానికి వివరణ ఇస్తూ ప్రత్యేక హోదాకు సంబంధించిన నివేదికను చదివి చదివి నాకు సైటొచ్చింది అంటూ సరదాగా ఛమత్కరించారు.