పవన్‌లో పెరిగిన జోరు... కాకినాడ లోనే నిరాహార దీక్ష

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. నిరంతరం జనంలో తిరుగుతూ అధికార పార్టీని టార్గెట్ గా విమర్శల దాడి పెంచారు. వైసీపీ నుంచి వచ్చే కౌంటర్లకు దీటుగా స్పందిస్తూ అంతకు మించిన మాటలతో దాడి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇంతకు జనసేనాని దూకుడుకు రీజన్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన పవన్ లో పొలిటికల్ స్పీడ్ పెరిగింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇసుక సమస్య ఏపీలో సమస్యల పై హస్తిన పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన పర్యటన చాలా సీక్రెట్ గా సాగింది. హస్తినలో ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి అనేది ఇప్పటికీ గుట్టుగానే ఉంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచారు. ప్రతి రోజూ జనం లో తిరుగుతూ అన్ని ప్రాంతాల వారిని కలుస్తూ అధికార పార్టీ పై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల నుంచి వస్తున్న వాదన. మొన్న అనంతపురంలో రెడ్డి నేతల పై జనసేన కార్యకర్తలు చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. దీని పై రెడ్డి సంఘాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ సాకీ పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టదని సూచించారు. తనకు అన్ని కులాలు ఒక్కటేనన్నారు. వైసీపీకి కులం ఉందేమో కానీ తమకు లేదన్నారు. అంతేకాదు 3 రోజులలోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు పవన్ కల్యాణ్. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యల పై చర్చించి వాటికి పరిష్కారం చూపాలన్నారు.

ఈ నెల 12 లోగా అన్నదాతలకు గిట్టుబాటు ధర పై భరోసా ఇవ్వకపోతే కాకినాడ లోనే నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రతి పర్యటనలో అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జనసేనా. పవన్ దూకుడు పై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎలక్షన్స్ లో కూడా ఇంతటి దూకుడు ప్రదర్శించని ఈ జనసేనాని ఇప్పుడు సడెన్ గా రూటు మార్చడం వెనుకాల మతలబేంటని చర్చించుకుంటున్నాయి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో కేంద్రం కనుసన్నల్లో నడుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.