మరచి ప్రశ్నించిన బాబు..ధీటైన సమాధానమిచ్చిన పవన్

 

తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు.తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పవన్‌ ఉద్దానానికి వచ్చి చాలా అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీరు కార్చారు. మరి కేంద్రానికి లేఖ రాశారా? కేంద్రాన్ని నిలదీశారా..? ఒక్కసారైనా గట్టిగా హెచ్చరించారా..?’ అని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ప్రధానికి రాసిన లేఖను పవన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘సీఎం గారూ.. తిత్లీ బాధితులను ఆదుకోవాలని నేను ప్రధానికి లేఖ కూడా రాయలేదని మీరు నాపై విమర్శలు చేశారు. ఇదిగో సాక్ష్యం’’ అంటూ ఆ లేఖను జత చేశారు. ఏపీలో అధిక శాతం ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభుత్వం వైపే ఉందని, దాన్ని నియంత్రిస్తూ తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు.గతంలో పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాను ప్రభావంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.తిత్లీ తుఫానును జాతీయ విపత్తుగా పరిగణించవలసిందిగా కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలియజేసారు.మరి చంద్రబాబు దాన్ని మరిచారో ఏమో పవన్ ను ప్రశ్నించారు.దానికి అంతే ధీటుగా పవన్ ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పారు.