పాదయాత్ర చేయాలని ఉంది..

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లా గుత్తిలో గేట్స్‌ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దీనిలో భాగంగానే.. రాయలసీమలోని కరవు ప్రాంతాలను పరిశీలించేందుకు పాదయాత్ర చేయాలని ఉందని.. అప్పుడే కరవు గురించి మాట్లాడతానన్నారు. ఇంకా రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడుతూ..రిజర్వేషన్లపై తనకు స్పష్టత ఉందని.. రిజర్వేషన్లు లేక ఓసీలు ఎంత బాధపడుతున్నారో తెలుసన్నారు. నిర్భయ ఘటన జరిగే వరకు.. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి చట్టం తీసుకురాలేకపోయారని.. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లకు నాయకుల కళ్లు తెరిచారని మండిపడ్డారు. అనంతపురంలో కరవు పోవాలంటే అవినీతిని నిర్మూలించాలన్నారు. తాను గ్రామాలను దత్తత తీసుకోలేదని.. అనంతపురాన్నే దత్తత తీసుకున్నానన్నారు.