తొలి పార్టీ కార్యలయం అనంతలోనే.. అనంత నుండే పోటీ చేస్తా..

 

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు నా తొలి పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తా... ఎన్నికల్లో గెలుస్తానో లేదో కూడా నాకు తెలియదు.. కానీ పోటీ చేయడం మాత్రం ఖాయం అని తేల్చి చెప్పారు. రాయలసీమ ప్రజలకు అండగా ఉంటానని.. మీ సమస్యలే నా సమస్యలుగా.. మీ ఇంట్లో వాడిగా.. మీ బిడ్డగా ఉంటానని.. ఇక్కడ కరువును ఏ విధంగా నిర్మూలించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఎవరు మద్దతిచ్చినా.. ఇవ్వకపోయినా సమస్యలపై పోరాడతా అని అన్నారు.