మోడీ విమానానికి అనుమతి నిరాకరణ... భారత్ పై విషం కక్కిన పాకిస్తాన్

 

భారత్ పై మరోసారి పాకిస్తాన్ విషం కక్కింది. పాక్ గగనతలంగా మీదుగా ప్రధాని మోడీ విమానం వెళ్లడానికి అనుమతి నిరాకరించింది. మోడీ విమానాన్ని అనుమతించాలంటూ భారత అధికారులు చేసిన విజ్ఞప్తిని పాకిస్తాన్ నిరాకరించింది. సెప్టెంబర్ 21న అమెరికా వెళ్లనున్న ప్రధాని మోడీ... వారం రోజులపాటు యూఎస్ లో పర్యటించనున్నారు. అయితే మోడీ ప్రయాణించే ప్రత్యేక విమానం... పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దాంతో భారత అధికారులు ముందస్తుగా పాకిస్తాన్ అనుమతి కోరారు. ఇండియన్ గవర్నమెంట్ విజ్ఞప్తిపై స్పందించిన పాక్.... మోడీ విమానానికి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత భారత్ పై విషం కక్కుతోన్న పాకిస్తాన్.... ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విమానానికి కూడా పాక్ అనుమతి నిరాకరించింది. పాక్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడుల తర్వాత కొద్దిరోజులు పాక్ గగనతలంపై ఆంక్షలు విధించిన ఇమ్రాన్ ప్రభుత్వం.... ఇప్పుడు కశ్మీర్ ఇష్యూలో మరోసారి పాక్ గగనతలంలోకి భారత విమానాలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోడీ విమానాన్ని సైతం అనుమతించే ప్రసక్తే లేదని స్వయంగా అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్లు పాక్ అధికారులు ప్రకటించారు.