రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న ఆర్టీసీ సమ్మె.. మినిస్టర్ క్వార్టర్స్ కు ముప్పు!

 

ఆర్టీసీ సమ్మే మొదలై ఇప్పటికి పది రోజులు కావొస్తున్నా రోజురోజుకు ఉత్కంఠంగా కొనసాగుతున్న అంశంగా మారింది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించేందుకు వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పించారు విద్యార్ధులు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన వ్యక్తం చేయగా తరవాత మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ర్యాలీగా బయలుదేరారు. ఉస్మానియా గేట్ దాటక ముందే వారిని పోలీసులు అడ్డుకొని  అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని వ్యాన్ లలో ఎక్కించారు పోలీసు అధికారులు. 

తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం అనేది వీలైనంత త్వరగా జరిగితేనే అందరికి మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యనిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి లాంటి వ్యక్తులు సురేందర్ గౌడ్ లాంటి వ్యక్తులు చనిపోవడంతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ  వాళ్ల ఆత్మశాంతి చేకూర్చే విధంగా  నివాళులర్పించారు.

ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విద్యార్థిలు ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటున్న నేపధ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించారు, కావున  విద్యాసంస్థలను తక్షణమే కేసీఆర్ గారు సెలవులనూ విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పదోవ  రోజుకు చేరింది. దాదాపు ఆరుగురు ఏడుగురు పేద కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు పిట్టల్లా రాలిపోతున్నారు. పొడిగించిన వారంరోజులు విద్యాసంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలని, కాలేజీలు స్కూళ్లను వెంటనే తెరిపించి పిల్లల చదువును కూడా ముందుకు తీసుకుపోవాలని ఆర్టీసీ సమ్మేలోని నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పరిష్కారం చూడాలని లేదంటే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా అవుతాయని వెల్లడించారు.