ఉల్లి రికార్డ్... కిలో రూ.200 రూపాయలు పలకనుంది!!

 

అక్షరాలా వందకు చేరువవుతోంది ఉల్లిగడ్డ రేటు. ప్రస్తుతం మార్కెట్ లో రూ.60 నుండి రూ.70 మధ్య పలుకుతున్న ఉల్లి రేటు రేపో మాపో 100 కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ్టి లెక్కల ప్రకారం క్వింటాలకు ఉల్లి ధర అక్షరాలా రూ.6,700 సాయంత్రానికి రూ.7,000 కావచ్చు రేపో మాపో రూ.10,000 కావచ్చు. గతేడాది ఇదే సీజన్ లో క్వింటా ఉల్లి ధర 1000 రూపాయలు కూడా లేదు. కానీ ఈ సారి 10,000 లకు చేరుతోంది.

మహారాష్ట్ర, కర్ణాటక తరువాత ఉల్లిని బాగా పండించేది కర్నూలు ఒకటే. ఇక్కడి మార్కెట్ లో ఉల్లి పలికిన ఆల్ టైమ్ హై రేటు 5,580 రూపాయలు అది కూడా 2017 లో, కానీ ఇప్పుడు దూకుడు ఎలా ఉంది అంటే నవంబర్ 20న అక్కడి మార్కెట్ ధర  రూ.6,700 ల రూపాయలు పలికింది. ఇది హోల్ సేల్ రేటు.. అదే రిటైల్ మార్కెట్ లో ఇస్తే రూ.67 రూపాయల. కానీ దళారుల తరువాత వ్యాపారుడు లాభాలు వేసుకోగా మన వంటింటికి వచ్చే సరికి రూ.100 ఖాయం.ఈ ఏడాది జూలైలో క్వింటాలు ఉల్లి రూ.1,670 రూపాయలు. ఆగస్టులో రూ.2900 , సెప్టెంబర్ లో రూ.4400, అక్టోబర్ లో రూ.4700 ఉంటే ఈ నెలలో మొన్నటి రేటు రూ.5590 పలికింది. నిన్న రూ.6700 పలికిన రేటుతో రైతు ఫుల్ హ్యాపీ, కాని వినియోగదారుడు మాత్రం లబోదిబోమంటున్నాడు. ఉల్లి కొనాలంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. 

ఉల్లి రేటు ఇంతలా పెరగటానికి కారణం ఎగువన కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు. అవును ఈ ఏడాది కుండపోతతో మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉల్లిసాగు దెబ్బతింది. దీంతో రోజూ 5000 పై వచ్చే ఉల్లి ట్రాక్టర్ లతో నాసిక్ మార్కెట్ కిటకిటలాడిపోయేది. కానీ ఈ సారి 100 కూడా లేవు. పైగా గత ఏడాది క్వింటాలకు రూ.1000 కూడా ధర పలకక పోవడంతో గతేడాది రూ.25,000 ల హెక్టార్లల్లో పంట వేసిన రైతులు ఈ సారి రూ.13,000 ల హెక్టార్లలోనే సాగు చేశారు. ఫలితం 2018 లో 8 లక్షల క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్ కు వస్తే ఈ ఏడాది కేవలం మూడున్నర లక్షల క్వింటాళ్ల సరుకు మాత్రమే వచ్చింది. 

అమాంతం పెరిగిన పెరుగుతున్న ఉల్లి రేటుతో ఎకరాకు రూ.50,000 ల పెట్టుబడి పెట్టిన రైతుకు ఈ సారి లక్షన్నర వరకు లాభం వస్తుంది. అప్పులు తీరుతున్నాయి. ఇది ఆనందించే విషయమే అయినా వినియోగదారులకు మాత్రం కన్నీళ్లు తప్పట్లేదు. పైగా డిమాండ్ ఎక్కువ సరుకు తక్కువగా ఉండటంతో దళారులు పంజా విసరటం ఖాయం. మార్కెట్ ను ఇంకాస్త బ్లాక్ చేస్తే డిసెంబర్ లో కిలో రూ.200 లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఉల్లి కోయకుండానే చూస్తేనే కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్ లో 3 నెలల నుండి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర మార్కెట్ లో రూ.80 రూపాయల వరకు వుంది. రిటైల్స్ కొచ్చేసరికి రూ.100 రూపాయల వరకు పలుకుతుంది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారస్తులు.