జంప్ జిలానీలకు హైకోర్టు నోటీసులు

 

తెలంగాణ రాష్ట్రంలో పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలను ఫిరాయించి అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద స్పీకర్ స్పందించకపోవడంతో ఆయా పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పార్టీ ఫిరాయింపుపై ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. నోటీసులు అందుకున్ వారిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్ రెడ్డి వున్నారు.