సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు

No Mercy Petition To Sanjay Dutt, Sanjay Dutt Should Not Get Mercy Plea, Move for mercy for Sanjay Dutt sends perverse signal, Petition No mercy for Sanjay Dutt

 

1993 ముంబాయి వరుస బాంబు కేసులో టాడా సంజయ్ దత్ దగ్గర చట్టవిరుద్ధ, లైసెన్స్ లేని ఆయుధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల శిక్ష విధించింది. పద్దెనిమిది నెలలు జైలులో ఉన్న సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇరవై సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు సంజయ్ దత్ ను నిందితుడిగా పేర్కొంటూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ తారలు సంజయ్ ఇంటికి వచ్చి అతన్ని పరామర్శించి సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలని సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి చిరంజీవి, టాలీవుడ్ నటుడు రాం చరణ్ తేజ్, హృతిక్ రోషన్, విద్యాబాలన్ ప్రభుత్వాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సంజయ్ దత్ క్షమాభిక్షకు అర్హుడేనని తెల్చేశాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదని అంటోంది. సీనియర్ బిజెపి నేత గోపీనాథ్ ముందే మాట్లాడుతూ సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు అతను సెలబ్రిటీ కాబట్టి అతనికి క్షమాభిక్ష పెడితే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని చెప్పారు. మరొక బిజెపి ఎంపి బల్బీర్ పుంజ్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలి, గొప్పవారికి ఒక న్యాయం, బీదవాడికి మరొక న్యాయం అని  ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న అన్నా హజారే మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంజయ్ దత్ కట్టుబడి ఉండాలి అంతేకాని దేశ అత్యుత్తమ న్యాయస్థానం విధించిన శిక్షకు వ్యతిరేకంగా క్షమాభిక్ష పెట్టమని కోరరాదని హితవు పలికారు. ఆర్.ఎస్.ఎస్. నేత పాంచజన్య మాట్లాడుతూ బాంబు పేలుళ్ళలొ మరణించిన వారి బంధువుల ఆగ్రహం చల్లారి ఉంటుందని, రెండు దశాబ్ధాలుగా వీరంతా దోషులకు శిక్ష పడాలని ఎదురు చూస్తున్నారని, మరొక పక్క సంజయ్ దత్ కు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, కోట్లాది రూపాయలు సంజయ్ దత్ నటించే చిత్రాలు నిలిచిపోతాయని సంజయ్ దత్ కు బాటగా నిలుస్తున్నవారు అంటున్నారని అన్నారు. ఏమైతే నేమి సంజయ్ దత్ కు ఒక పక్క క్షమాభిక్ష పెట్టాలని కొన్ని వర్గాలు కోరుతుండగా మరోపక్క క్షమాభిక్ష పెట్టరాదని మరికొన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆఖరికి ఏ వర్గం గెలుస్తుందో వేచి చూడాల్సిందే