ఆర్టికల్ 370 రద్దు.. బక్రీద్ రోజు భారత్ స్వీట్లు వద్దు: పాక్

 

భారత్ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాకిస్థాన్ కోపంతో ఊగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. బక్రీద్ రోజున భారత బలగాలు మర్యాదపూర్వకంగా స్వీట్లు ఇస్తామన్నా పాక్ అంగీకరించ లేదు.

జాతీయ, సాంస్కృతిక వేడుకల సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. వాఘా-అటారీ సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం పరస్పర శుభాకాంక్షల మధ్య ఓ ఉత్సవాన్ని తలపించే రీతిలో జరిగేది.

ఎప్పట్లానే బక్రీద్ సందర్భంగా మిఠాయిలు తీసుకువస్తున్నామంటూ బీఎస్ఎఫ్ అధికారులు పాక్ కు సమాచారం అందించారు. కానీ, పాక్‌ దాన్ని తిరస్కరించింది. ఇరు దేశ సైనికుల మధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని చెప్పుకొచ్చింది. చివరిసారి గత జూన్‌లో రంజాన్‌ సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.