బీహార్ సీఎంగా మళ్ళీ నితీష్

 

బీహార్ సీఎంగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్‌ మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం ప్రస్తుత ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝి రాజీనామా చేశారు. శుక్రవారం మాంఝి ప్రభుత్వ బలపరీక్ష జరగాల్సి వుండగా ఆయనగారు బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే గవర్నర్ త్రిపాఠి అసెంబ్లీని రద్దు చేయకుండా నితీష్ కుమార్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అవటం పట్ల నిరసన తెలియస్తూ నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మాంఝిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. మాంఝి తన విపరీత ప్రవర్తనతో కొద్దికాలానికే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోకుండా నానా హడావిడి చేశారు. చివరికి రాజీనామా చేశారు.