టైరు జారిన విమానం...

న్యూయార్క్ లో పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీనివల్ల అనేక విమానాలను రద్దుచేశారు. శుక్రవారం ఉదయం ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల న్యూయార్క్ లోని లాగార్దియా ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా పక్కకి ఒరగడంతో అందులో ప్రయాణించే ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇందులో 127 మంది ప్రయాణికులు, 5గురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు కానీ, 28 మందికి స్వల్ప గాయాలైనట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలియజేశారు. ఏంటో ఈ రోజుల్లో విమాన ప్రయాణాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.