రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త గ‌వ‌ర్నర్‌

 

సెప్టెంబ‌ర్ 4తో రిజ‌ర్వ్ బ్యాంక్ ప్రస్థుతం గ‌వ‌ర్నర్ దువ్వూరి సుబ్బారావు ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌టంతో ఆ స్థానంలో కొత్త గ‌వ‌ర్నర్‌గా ర‌ఘురామ్ రాజ‌న్ బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నారు. ర‌ఘురామ్‌రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ 23వ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డ‌తారు. ఈయ‌న మూడేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

ప్రస్థుతం రాజ‌న్ భార‌త ప్రభుత్వానికి ప్రదాన ఆర్ధిక స‌ల‌హాదారుగా వ్యవ‌హ‌రిస్తున్నారు,  సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. త‌న‌కున్న అపూర్వ మేద‌స్సు కార‌ణంగానే రాజ‌న్ ఐఏఎస్ కాక‌పోయినా రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్ ఎంపిక‌య్యారు.

అసాధార‌ణ ప్రతిభావంతుడిగా రాజ‌న్‌కు పేరుంది. ప్రస్థుతం దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ త‌రుణంలో రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్‌గా బాధ్యత‌లు తీసుకుకోవ‌టం మంచి ప‌రిణామం అంటున్నారు విశ్లేష‌కులు. అత్యంత చిన్న వ‌య‌సులోనే ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డుతున్న వ్యక్తిగా కూడా రాజ‌న్ రికార్డ్ క్రియేట్ చేశారు.