రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

 

2nd phase of AP panchayat polls begins, 2nd phase of AP panchayat polls

 

 

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పలు జిల్లాలో బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల గుర్తులు తారుమారవడంతో ఆయా ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఏజెంట్లు ఘర్షణకు దిగారు. కొన్ని జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

 

రెండో విడతలో 6,971 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,910 కేంద్రాల్లో వెబ్‌కెమెరాల ద్వారా అధికారులు పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. రెండు గంటలకు కౌటింగ్ ప్రారంభంకానుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.