కోవిద్ 19 వైరస్ అరికట్టే ఇంట్రా నాజిల్ వ్యాక్సిన్

పరిశోధనలు చేస్తున్న పలు దేశాలు..
తుది దశలో ఫలితాలు..

కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ముమ్మరం చేస్తున్న ఈ ప్రపంచ దేశాలు అతి వేగంగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి.  ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోవిద్ 19వైరస్ కు వ్యాక్తిని కనుకోవాలన్న తపనతో దాదాపు 25 దేశాలు పరిశోధనలను వేగవంతం చేశాయి. చాలా దేశాలు తమ పరిశోధనలు ముగింపుకు వచ్చాయి అంటుంటే మరికొన్ని దేశాలు గుట్టు చప్పుడు కాకుండా క్లినికల్ ట్రయల్ కూడా పూర్తి చేసి వ్యాక్సిన్ ను మార్కట్ లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ గురించి వివరాలు మాత్రం రహస్యంగానే ఉంటున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ఇంట్రా మస్కులర్ ఇంజక్షన్ రూపంలో ఉంటుందా, లేక ఇంట్రా నాజిల్ డాప్స్ర్ అంటూ స్ప్రే రూపంలో ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంట్రా నాజిల్ రూపంలో వ్యాక్సిన్ను తీసుకురావాడానికి కెనడా, ఫిన్లాండ్, భారత్ తదితర దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రాయల్స్  కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.

ఇది ఎలా పనిచేస్తుందంటే..
సాధారణంగా వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్ ఇంజక్షన్ రూపంలో ఉంటుంది. అయితే కోవిద్ 19 వైరస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంట్రా నాజిల్ డ్రాప్స్ గానూ లేదా స్ప్రే కాను ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం,ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు అంటున్నారు.

ముక్కు లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ ను కరోనా ఎదుర్కొనేలా ఈ వాక్సిన్ సిద్ధం చేస్తుంది. ముక్కు లో వేసే డ్రాప్స్ ద్వారా లేదా స్ప్రే ద్వారా ఈ వ్యాక్సిన్నుఉపయోగిస్తారు. దీన్ని శ్వాసమార్గంలో కి పంపిస్తారు. కోవిద్ 19 వైరస్ దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ను ఈ  వ్యాక్సిన్ తయారు చేస్తుంది. ముక్కులతో పాటు శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగులు, జననేంద్రియ మార్గాల్లో శ్లేష్మకణాలను ఈ వ్యాక్సిన్ ప్రేరేపిస్తూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

సాధారణంగా  ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్  వ్యాధి కారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిని ఎదుర్కోనే యాంటీబాడీల్స్ ను తయారు చేస్తుంది. అయితే కోవిద్ 19 వైరస్ ముక్కు ద్వారా సోకి శ్లేష్మం ద్వారా శరీరంలోని ఊపిరితిత్తులు, పేగులు, మూత్రపిండాలకు చేరి వాటిని దెబ్బతీస్తుంది. శ్లేష్మంలో పనిచేసేలా వ్యాక్సిన్ ను రూపొందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది పరిశోధకుల ఆలోచన. ఇంట్రా  నాజిల్ వ్యాక్సిన్ యాంటీబాడీస్స్ తయారు చేయడంతో పాటు ఊపిరితిత్తులు, పేగులు, జననేంద్రియ మార్గాలలో కూడా రక్షణ అందిస్తుంది.

టీ, బీ కణాలు..
ఈ వ్యాక్సిన్ లో టీ కణాలు, బి కణాలు అని రెండు రకాల సెల్యులార్ కాంపోనెంట్స్ ఉంటాయి. బి కణాలు యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తే, టీ కణాలు బి కణాలు యాంటీబాడీస్ తయారు చేసేలా ప్రేరణ కలిగిస్తాయి. కోవిద్ 19 వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు కణాలు రక్షణ కవచాలుగా పనిచేస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

ఈ పరిశోధనలన్నీ విజయవంతమై కోవిద్ 19వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించే వ్యాక్సిన్ లు త్వరగా అందుబాటులోకి రావాలని ప్రపంచదేశాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. మరి ఏ దేశం ముందుగా ఈ మహమ్మారిని కట్టడి చేసే మందు కనిపెడుతుందో మనమూ వేచిచూద్దాం.