నా కుమారుడు ప్రధాని అవుతాడు: నరేంద్ర మోడి తల్లి

 

 Narendra Modi PM, Narendra Modi BJP, Narendra Modi gujarath, Narendra Modi congress

 

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రత్యర్ధి శ్వేతా భట్ పై 85 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మోడీకి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా, ఓ పోలీసు అధికారి భార్య అయిన శ్వేతా భట్ ను పోటీకి నిలమెట్టినా మోడీ విజయాన్ని, మెజార్టీని నిలువరించలేకపోయారు. ”నా కుమారుడు ఖచ్చితంగా ప్రధాని అవుతాడు” అని నరేంద్ర మోడి తల్లి హీరా బెన్ మీడియాతో అన్నారు. గుజరాత్ ఫలితాలు వెలువడుతుండగానే అహ్మదాబాద్ లోని మోడీ ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.


ఇక పోరుబందరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన గుజరాత్ పీసీసీ ఛీఫ్ అర్జున్ మోడ్వాడియా ఓటమి పాలయ్యారు. గుజరాత్ లోని 182 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో గెలిచిన బీజేపీ 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 52 స్థానాల్లో గెలిచన కాంగ్రెస్  3 స్థానాలలో అధిక్యంలో ఉంది. రెండు స్థానాలలో జీపీపీ విజయం సాధించగా, నాలుగు స్థానాలలో ఇతరులు గెలిచారు.