నారాయణఖేడ్ ఉప ఎన్నిక రేపే..

నారాయణఖేడ్ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖేడ్ నియోజకవర్గ పరిధిలో  286  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు 65 సున్నిత ప్రాంతాలు, 54 అతి సున్నిత ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఖేడ్ ఉప ఎన్నికకు 8 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,88,839 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పురుషులు 95,772, మహిళలు 93,040 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.