హరీష్ రావును పొగిడిన లోకేశ్

 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ ప్రతిపక్ష పార్టీ అని అందరికి తెలసిన విషయమే. అలాంటిది టీడీపీ యువనేత.. పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ను ప్రశంసించారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. హరీష్ రావు నిజమైన మాస్ లీడర్ అని.. నిత్యం జనాల్లో తిరుగుతూ, వారితో మమేకమైన ఉండే హరీష్ రావు విధానం తనకు బాగా నచ్చుతుందని ఆయనను ప్రశంసించారు. అయితే నారా లోకేశ్ హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.