వీజీ సిద్దార్థది ఆత్మహత్య కాదా ? కొట్టి చంపారా ?

 

కన్నడ రాష్ట్రంలోనే కాక భారత కార్పొరేట్ వ్యవస్థనే ఓ కుదుపు కుదిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కార్పోరేట్ కింగ్ సిద్ధార్థ మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయాని కంటే ముందు రెండు గంటల పాటు ఆయన ఏమి చేశారు అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల దర్యాప్తు లో తేలిన అనేక విషయాలు ఇప్పుడు కొత్త అనుమానాలకి కారణం అవుతున్నాయి. 

జులై 29న సాయంత్రం ఐదున్నర సమయంలో బ్రహ్మర కూట్లు టోల్‌ గేట్‌ ను సిద్ధార్థ కారు దాటి వెళ్లింది. వాస్తవానికి ఆ టోల్ గేట్ నుంచి నేత్రావతి నది వద్దకు ఎంత ఎక్కువ వేసుకున్నా అరగంట లో వెళ్లిపోవచ్చు, రాత్రి ఏడున్నరకే కారు బ్రిడ్జ్ మీదకి వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. ఈ మధ్య సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయమై డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఇక డ్రైవర్ బసవరాజు సైతం సిద్ధార్థ కనిపించకుండా పోయిన గంటన్నర తరువాతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో సిద్ధార్థ ఫోన్లో మాట్లాడుతూ కాసేపు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించారని, ఆపై ఆయన కనిపించక పోయే సరికి కాసేపు వెతికి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశానని బసవరాజు చెబుతున్నాడు. అంతే కాకా కారులో ప్రయణిస్తున్నప్పుడే సిద్ధార్థ పదిపదిహేను ఫోన్లు చేశారని చెబుతుండగా ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారన్న విషయం విచారణలో కీలకం కానుంది. 

అయితే మరో అనుమానాస్పద విషయం ఏంటంటే ? నదిలో దొరికిన ఆయన డేడ్ బాడీకి ఫ్యాంటు, బూట్లు, చేతి ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. ఆయన వేసుకున్న షర్ట్ లేదు. అంతే కాక ఆయన జేబులో ఉన్న వాలెట్, ఐడేంటీ కార్డులు అలానే ఉన్నా ఫోన్ మాత్రం మిస్సయ్యింది. ఆయన షర్ట్ తీసి దూకారు అనుకుంటే ఆ షర్ట్ బ్రిడ్జ్ మీద దొరికి ఉండాలి, లేదా షర్ట్ ని ఏవైనా జలచారాలు తినేశాయా అనడానికి లేదు, ఎందుకంటే అవి ఏమైనా చేసి ఉంటె ఆయన బాడీకి కూడా గాయాలు అయ్యుండాలి. 

కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయం నుండి 36 గంటలు గడిచినా, మృతదేహం పాడు కాలేదు, నిజానికి అంత సేపు నీళ్ళలో ఉండి ఉంటె బాడీ దెబ్బ తింటుంది, జలచరాలు బాడీని పీక్కు తినే అవకాశం కూడా ఉంది. కానీ ఆయన బాడీ చెక్కు చెదర లేదు. పైగా ముక్కు నుంచి రక్తం కారుతున్న గుర్తులు తాజాగానే ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అంటే ఆయనను ఎవరైనా దేని కోసం అయినా తీవ్రంగా కొట్టారా ? ఆయన చనిపోయాక నదిలో పదేసారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాసిన లేఖకి ఆయన బాడీ దొరకడానికి ఆత్మహత్య అని సర్దిచెప్పుకున్నా ఇప్పుడు ఈ విషయాలు అన్నీ పోలీసులకు కొత్త అనుమానాలు వచ్చేలా చేస్తోంది. అంతేకాక కార్పొరేట్ వర్గాల ప్రముఖులు కూడా సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. 

మరో వాదన ప్రకారం వీజీ సిద్ధార్థకు కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఐటీ విభాగం ఆయన మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టిందట. సిద్ధార్థ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణకు అల్లుడు కాగా, కృష్ణకు, సిద్దార్దకి శివకుమార్‌ అత్యంత సన్నిహితుడు. కృష్ణ బీజేపీలో చేరినా వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. సిద్ధార్థతో కుటుంబ, ఆర్థిక లావాదేవీలు వ్యాపార్లు కూడా ఉన్నాయి. 

2017 ఆగస్టులో ఎన్నికలకి ముందు శివకుమార్‌ ఆస్తుల మీద ఐటీ దాడులు చేసినప్పుడు సిద్ధార్థతో ఆయనకున్న ఆర్థిక లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోకుంటే ? మరి ఆయన ఎలా చనిపోయారు ? 36 గంటల పాటు ఆయన మృతదేహం ఎందుకు చెక్కు చెదర లేదు. ఆయనను ఎవరైనా హత్య చేశారా ? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. 

అయితే ఈ ఘటన జరిగి రెండ్రోజులు కూడా కాక మునుపే మంగళూరుకి చెందిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆయన పోస్టుమార్టం వస్తే ఏమైనా ఆధారాలు లభించే అవకాశం ఉంది, కానీ ఇద్దరు ఉన్నతాధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం సంచలనంగా మారింది.