చక్రిది హత్య కాదు...

 

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం మీద ఏర్పడిన అనుమానాలన్నీ వీడిపోయాయి. చక్రిని ఆయన భార్యే హత్య చేసిందని చక్రి తల్లిదండ్రులు, చక్రి తల్లిదండ్రులే చక్రికి విషం పెట్టి వుంటారని ఆయన భార్య పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చక్రిని దహనం చేయగా మిగిలిన అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన అస్థికల్లో  విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడైంది. చక్రిది సహజమరణమేననీ అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు.