చర్లపల్లి జైలును సందర్శించిన ఎంపీ సంతోష్

ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు..
ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల పరిశీలన..
ఎంపికి తమ సమస్యలపై వినతిపత్రం అందించిన ఖైదీలు..

చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న వారి సమస్యలను, వారిలో సత్ ప్రవర్తన కలిగిన వారిని జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. జైలు శాఖాధిపతి రాజీవ్ త్రివేది, ఐ.పి.యస్ తో కలిసి ఆయన శనివారం చర్లపల్లిలోని కే౦ద్ర కారాగారం సందర్శించారు. జైలు ఆవరణలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన సంజీవని(హాస్పిటల్) సందర్శించి అక్కడ కల్పిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. ప్రొఫెసర్ సి. బీనా గారి ఆధ్వర్యంలో ఖైదీలకు కల్పించిన M.Sc. Psychology Lab ను సందర్శించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం టెస్ట్ చేసి బాగున్నాయని మెచ్చుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్ లో ఖైదీలు  తమ క్షమాభిక్ష అంశాన్ని సిఎం గారి చెప్పాలని కోరుతూ వినతిపత్రం అందించారు. జైలులో ఉన్న ఖైదీల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా నూతనంగా నిర్మించబడిన శానిటైజర్ పరిశ్రమను మెచ్చుకున్నారు. ఇతర ఉపాధి శిక్షణా అంశాలను పరిశీలించి ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.