జగన్ మత మార్పిడి పథకం అమలు పరుస్తున్నారు.. అమిత్ షాకు సీఎం రమేష్ ఫిర్యాదు

 

ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై.. ఎంపీ సీఎం రమేష్, ఏపి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో మత మార్పిళ్ల దిశగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని చర్యలను సీఎం రమేష్ ఆధారాలతో సహా అందచేశారు. హిందువులను మతమార్పిడుల దిశగా ప్రోత్సహించేందుకు జగన్ కుటుంబానికి చెందిన మతపరమైన చానళ్ళలో జరుగుతున్న ప్రసారాల వీడియోలను అమిత్ షాకు సీఎం రమేశ్ అందించినట్లుగా తెలుస్తోంది. జగన్ బావ బ్రదర్ అనిల్ కు చెందిన రక్షణ టీవీలో భగవద్గీత చదువుతున్నట్టుగా బైబుళ్లును చదువుతున్నారు. ఆ చానల్ మొత్తం మతమార్పిడి లక్ష్యంతో హిందువులను టార్గెట్ చేసిందన్న అనుమానాలున్నాయని అభిషేకాలు పూజలు లాంటివి కూడా హిందూ పద్ధతిలో క్రీస్తుకు చేస్తూ మత మార్పిడలకు ప్రోత్సహిస్తున్నారని ఆర్ఎస్ఎస్ నేతలు కూడా అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. 

అదే సమయంలో హిందూ దేవుళ్లను బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసేలా ఓ ప్రణాళిక బద్ధమైన వ్యవహారం నడుస్తోందని దానికి సాక్ష్యంగా  తిరుమలలో ధరల పెంపు అంశాన్ని తెలిపారు.  క్రైస్తవులు జెరూసలెం యాత్రకు వెళ్లే ప్రోత్సాహకాన్ని పెంచడాన్ని కూడా గుర్తు చేశారు. పేదలకు శ్రీనివాసుడిని ఉచితంగా దర్శించుకునేలా దివ్యదర్శనం అనే పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని నిలిపివేశారు. ఆర్థిక సమస్యలే కారణమని చెబుతున్నారు. అదే సమయంలో జెరూసలెం యాత్రకు ప్రోత్సాహకాలు పెంచడమే కాకుండా పాస్టర్ లు అనిపించుకున్న ప్రతి ఒక్కరికీ నెలకు 5,000 ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. సీఎం రమేష్ బిజెపి ఆర్ఎస్ఎస్ నేతల ఫిర్యాదులను అమిత్ షా సావధానంగా విన్నారు. పార్టీ పరంగా ఇలాంటి ప్రయత్నాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలని ఆదేశించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే వ్యతిరేకించాలన్నారు. అదే సమయంలో ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిని బట్టి యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్నదాని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.