ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు... కేంద్రమంత్రి సిన్హా

 

పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఏపీకి ప్రత్యేక హోదా రాదు అన్న విషయం చాలా క్లియర్ గానే అర్దమవుతోంది. ఏపీ ప్రత్యేక హోదా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజ్యసభలో ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని, ఆ లోటును పూడ్చాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంవల్ల ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.

 

అయితే దీనికి కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని.. ఏపీ రెవెన్యూ లోటును భరించలేం.. ఏపీకి ప్రత్యేకహోదాపై నీతిఆయోగ్ ఎలాంటి సూచన చేయలేదని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా గురించి లేదని ఆయన స్పష్టం చేశారు.