Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వర్షాకాలంలో విషజ్వరాల బెడద రాకూడదంటే తీసుకోవలసిన జాగ్రత్తలు..!
posted on: Jul 15, 2025 9:30AM

వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది. వాతావరణం బాగా చల్లగా ఉంటుందనే కారణంతో దీన్ని ఇష్టపడతారు. అయితే వర్షాకాలం విషజ్వరాలను, వైరల్ ఇన్ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. ఈ కాలంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్ మార్పుకు అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా విషజ్వరాలలో డెంగ్యూ ప్రముఖమైనది. లో ప్లేట్ లెట్ ల కౌంట్ తగ్గుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే, దానిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం, శుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. త్రాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు స్వచ్చంగా లేవని అనిపిస్తే వాటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి.
వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల జ్వరం, శరీర నొప్పులు వస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉండి, తలనొప్పి నిరంతరంగా ఉంటే డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాలుగు నుండి ఐదు గంటల్లోపు మందులు తీసుకున్న తర్వాత జ్వరం తగ్గితే, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో టైఫాయిడ్, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా వంటివి ముఖ్యమైనవి. వాటిని నివారించడానికి ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నీటి పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్ర మీద ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి. తినడానికి ముందు, తిన్న తర్వాత, మలవిసర్జన చేసిన తర్వాత నీటిని తాకే ముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి. పిల్లలు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు ఆటల నేపథ్యంలో చేతులను ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఆహారం ఎప్పుడూ బాగా ఉడికినదై ఉండాలి. పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని నివారించాలి.
పండ్లు, కూరగాయలను తినేముందు శుభ్రమైన నీటితో కడగాలి. బయట ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. బావులు, నదులు లేదా చెరువుల దగ్గర మలవిసర్జన చేయవద్దు. నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దోమలు, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.
స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి సమాచారం పొందాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు పరిశుభ్రతే శ్రీరామ రక్ష అనే విషయం మరవకూడదు. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..






