మోడీ సర్కార్ మరో సంచలన బిల్లు.. మత మార్పిడికి ఇక చెల్లు!!

 

రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న మోడీ ప్రభుత్వం.. మత మార్పిడులను నిరోధించేలా మరో సంచలన బిల్లుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను తీసుకొచ్చింది. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ ముస్లిం మహిళా వివాహ హక్కుల బిల్లు వంటి పలు చారిత్రక బిల్లులు ఇందులో ఉన్నాయి.

కాగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మత మార్పిడులను నిరోధించే బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించిందనీ.. ఇదే అంశంపై ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎలాంటి మత మార్పిడులనైనా నిరోధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది.