మోదీ ప్రభుత్వం సెన్సేషన్.. అగ్రవర్ణాలకు రిజర్వేషన్

 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కోటా ప్రకటించింది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ కోటా వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారంనాడు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ జరిగింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటా వర్తింపజేయాలంటూ చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మేరకు.. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్నవారికి ఈ కోటా వర్తిస్తుంది.