మారిన కాల్ చార్జీలతో మోత మోగుతున్న మొబైల్ బిల్లులు

 

మొబైల్ బిల్లు మోత మోగింది, కాస్ట్ లీగా మారిన కాల్ చార్జీలు 40 శాతానికి పైగా పెరిగిన ప్లాన్ ధరలు, మొబైల్ బిల్లుల మోత మోగించాయి టెలికాం కంపెనీలు. వాయిస్ కాల్ చార్జెస్, మొబైల్ డేటా టారిఫ్ లను పెంచాయి. అయిదేళ్ళలో తొలి సారిగా ప్రీపెయిడ్ కస్టమర్ లకు వాయిస్ కాల్, డేటా చార్జీలు పెరిగాయి. కనీసం 15 శాతం నుంచి గరిష్టంగా 47 శాతం వరకు చార్జీలు పెరిగాయి. ఇప్పటి దాకా ఉచితంగానే లభించిన ఇన్ కమింగ్ సేవలు ఇప్పుడు ప్రియమయ్యాయి. నెలకు 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటేనే ఇన్ కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి పెంచిన ఛార్జీలు అందుబాటులో ఉన్నట్టు తెలిపాయి వొడాఫోన్, ఎయిర్టెల్. 

మూడేళ్ల క్రితం జియో రాకతో ఫ్రీ అన్ లిమిటెడ్ కాల్స్ వచ్చాయి , టెలికాం రంగంలో సంచలనంగా మారాయి. కానీ నేడు ఫ్రీ కాల్స్ లేకుండా పోయాయి. జియో టూ జియో కాకుండా ఇతర నెట్ వర్క్ యూజర్లకు చేసే ప్రతి కాల్స్ పై నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తోంది జియో. జియో కస్టమర్లు ఆయా ప్లాన్లలో టాక్ టైం దాటితే ఇతర నెట్ వర్క్స్ కు ఫోన్ చేయాలంటే టాప్ అప్ కార్డ్స్ వేసుకోవాల్సిందే. ఎయిర్టెల్ కొత్త ప్లాన్ లో రోజుకు 50 పైసల నుంచి 2 రూపాయల 85 పైసల వరకు పెరగనున్నాయి. ఎయిర్టెల్ తన 169,199 రూపాయల ప్లాన్లను విలీనంచేసి ఒకే ప్యాక్ లో 248 రూపాయలకు అందించనుంది. 169 రూపాయల ప్లాన్ ను ఎంచుకుంటున్న వినియోగదారులు ఇక పై 47 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే రోజుకు 1.5 ఐదు జీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్, ఐడియా కూడా ప్రీపెయిడ్ వినియోగదారులకు 2 రోజులు, 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను ప్రకటించింది. 

మునుపటి ప్రణాళికలతో పోలిస్తే కొత్త ప్రణాళికల్లో దాదాపు 42 శాతం వరకు రేట్లు పెరగనున్నాయి. ఓవరాల్ గా ఉచిత సేవలకు టెలికాం సంస్థలు స్వస్తి పలుకుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది ఎయిర్టెల్. చార్జీల్లో పెరుగుదల 50 శాతం వరకు ఉండొచ్చని ప్రకటించింది. నెలకు కనీసం 49 తో రీచార్జ్ చేయిస్తేనే కస్టమర్లకు ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి.కస్టమర్ల సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్న వొడాఫోన్, ఐడియా 2, 28,84, 365 రోజుల కాల వ్యవధితో ఇప్పటికే ఉన్న టారిఫ్ లకు కొత్త చార్జీలను ప్రకటించింది. 41.02 శాతం వరకు చార్జీలను పెంచింది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అన్ లిమిటెడ్ కాల్స్ 12 జీబీ డేటాకు 998 రూపాయలుండగా 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ 14,99 రూపాయలుగా ప్లాన్ మార్చింది. వొడాఫోన్, ఐడియా రోజుకు 1.5 జీబీ డేటా అన్ లిమిటెడ్ కాల్స్ తో 365 రోజుల కాలపరిమితికి ఇప్పటి వరకు 1699 వసూలు చేస్తుండగా ఇక పై ఈ ప్లాన్ 2,399 గా మారింది. 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా లభించే అన్ లిమిటెడ్ ప్లాన్ 458 నుంచి 31 శాతం అధికమై 599కి చేరింది. అన్ లిమిటెడ్ ప్లాన్ కింద ఉన్న ఎస్సెమ్మెస్ లను రోజుకు 100, కాల్స్ కూడా టైం పరిమితి కిందకు తీసుకువస్తున్నట్టు ప్రకటించింది వొడాఫోన్, ఐడియా. ఎయిర్టెల్ చార్జీల పెంపు కూడా రోజుకు 50 పైసల నుంచి 2 రూపాయల 85 పైసల వరకు ఉంది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అన్ లిమిటెడ్ కాల్స్, 12 జీబీ డేటా ప్లాన్, 998 కి లభిస్తుండగా ఇక పై 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ 14,99 కానుంది. ఇక జియో కాల్స్ డేటా చార్జీలు కూడా 40 శాతం వరకు పెరగనున్నాయి. కొత్త ప్లాన్స్ కింద కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది జియో. ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు పరిమితి విధించనున్నట్టు తెలిపింది.