ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటాలో ఏర్పడిన 10 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ తరపున 5, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తరపున 3, వైఎస్సార్సీ తరపున 1, టి.ఆర్.ఎస్. తరపున 1  నామినేషన్లను దాఖలు చేశారు. 10 స్థానాలకు గాను 10 నామినేషన్లే దాఖలవడంతో పోటీ చేసినవారు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నందువల్ల అధికారికంగా ఇప్పుడే ఫలితాలు వెళ్ళడించరు.