తిరుప‌తిని మాకిచ్చేయండి



ఆంద్రప్రదేశ్ లో విభ‌జ‌న స‌మైక్య సెగ‌ల‌తో భ‌గ్గుమంటుంటే, ఓ తమిళ నాయ‌కుడు కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకు వ‌చ్చాడు. తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల వారే పంప‌కాలు తేల‌క గొడ‌వ‌లు ప‌డుతుంటే ఇప్పుడు కొత్త గా తిరుప‌తిని మాకు ఇచ్చేయండి అంటూ ఓ ఫ‌న్నీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు పిఎంకే నేత రాందాస్ .

రాష్ట్రంలో నేల కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల మూలంగానే ఇలా పొరుగు రాష్ట్రాల వారికి లోక‌వ‌వున్నామంటున్నారు సీమాంద్ర నాయ‌కులు. ఇన్నాళ్లు విభ‌జ‌న సెగ‌ల‌తో అబివృద్దిలో వెనుక‌ప‌డిన రాష్ట్రం ఇప్పుడు స‌మైక్య సెగ‌ల‌తో అట్టుడుకుతుంది. దీంతో మ‌రోసారి అభివృద్ది ఆగిపోయింది.

తిరుప‌తిలో తెలుగు మాట్లాడే వారికంటే అర‌వం మాట్లాడేవారే ఎక్కువ‌గా ఉన్నార‌న్న రాందాస్ ఈ కార‌ణం తోనే తిరుప‌తిని మాకు ఇచ్చేయాల‌ని కోరుతున్నామ‌న్నానరు. అయితే రాందాస్ వ్యాఖ్యల‌తో తిరుప‌తి విడిపోక‌పోయినా.. మనం పొరుగు రాష్ట్రాల దృష్టిలో ఎంత చుల‌క అయ్యామో మాత్రం అర్ధం అవుతుంది.