వ‌న్‌ మిలియన్‌ మెడికల్‌ మాస్క్‌ల స్వాధీనం!

కరోనా కట్టడికి సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మరికొద్ది రోజులు పొడగించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు కాలాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌, 1,168,000 మెడికల్‌ మాస్క్‌లను సీజ్ చేసింది. వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, హెయిల్‌ సిటీ నుంచి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధికారులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. అథారిటీస్‌ ఎప్పటికప్పుడు ఇలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ ఏడాది తొలి మాసం నుంచే సౌదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తోంది. వాటికి కొనసాగింపుగానే ప్రస్తుత నిర్ణయం తీసుకుంది. ఇంతటి కఠిన నిర్ణయాల కారణంగా కరోనా మృతుల సంఖ్యను అదుపు చేయగలుగుతోంది. సౌదీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయారు.