ఏపీకి వైద్య సామాగ్రిని తెచ్చిన‌ ఎయిర్ ఇండియా విమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖకు వైద్య సామాగ్రిని తీసుకు వ‌చ్చిన స్పెషల్ ఎయిర్ ఇండియా కార్గో విమానం ఈ రోజు 1740 IST విజయవాడ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయింది. లాక్డౌన్ తర్వాత విజ‌య‌వాడ‌ విమానాశ్రయంలో ఇదే మొదటి పెద్ద విమాన ఆపరేషన్.

విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోంది. వైద్య పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోంది.

కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్‌టెక్ జోన్‌లో ఇవి తయారు అవుతుండటం చాలా కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు.