వ్యాక్సిన్ రాకపోతే అప్పటికి భారత్ లో రోజుకు 2.5 లక్షల కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచానికి ఈ ముప్పు ఇప్పటిలో తొలగి పోదని ఒక పక్క డబ్ల్యు హెచ్ఓ చెపుతోంది. ఈ మహమ్మారిని కనుక సమర్ధవంతంగా కంట్రోల్ చేయకపోతే 2021 మార్చ్ నాటికీ 25 కోట్ల మంది ప్రజలకు ఈ వైరస్ సోకడంతో పాటు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం భారత్ లో మనం చూస్తున్నది ప్రారంభ దశ మాత్రమే అని, ముందు ముందు కరోనా అసలైన తీవ్రతను చూడవలసి రావచ్చని ఆ పరిశోధకులు చెపుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరికి అంటే వచ్చే డిసెంబర్ కు కనుక వ్యాక్సిన్ రాకపోతే కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఆ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం వచ్చే మార్చ్ 2021 నాటికీ మన దేశం లో రోజుకు 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. అప్పటికి కరోనాతో అత్యంత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే దేశం భారతేనట. ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉన్నా 2021 ఫిబ్రవరి నాటికి ఇండియా టాప్‌కి వెళ్తుందని ఆ అధ్యయనం తెలియ చేస్తోంది.