శివుడిని నమ్ముకున్న దీదీ..

పశ్చిమ బెంగాల్ లో ఓట్లను పోలరైజ్ చేసేందుకు బీజేపీ జైశ్రీరామ్ నినాదం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ లేచి ప్రసంగం చేయబోతుండగా.. బీజేపీ నాయకులు ఒక్కసారిగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో.. ఆమె ప్రసంగించకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

 తాజాగా బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇక బీజేపీ ఫాలో అవుతున్న "హార్డ్‌కోర్ హిందుత్వ" కి కౌంటర్ గా సీఎం మమత నేతృత్వంలోని తృణమూల్ ఇకపై "సాఫ్ట్ హిందుత్వ" ను ఫాలో కావాలని డిసైడ్ అయింది..రాముడికి విరుగుడుగా మమత శివుణ్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో ఆమె తన ఎన్నికల నామినేషన్‌ను మహా శివరాత్రి పర్వ దినాన దఙ్ఖలు చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆమె అక్కడే తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటు అక్కడ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆమె నామినేషన్ వేయడానికి ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు గ తెల్సుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన పాదయాత్రను మమత నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రతి రోజు ఆమె కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లుగా సమాచారం. అంతేకాకుండా "బెంగాల్ కూతురే ఇక్కడ సీఎం కావాలి" అనే నినాదంతోనే ఎన్నికల్లోకి దూసుకెళ్లాలని ఇప్పటికే మమత నిర్ణయించారు.