ఆర్‌బీఐ ముట్ట‌డికి మ‌మ‌తా బెన‌ర్జి, కేజ్రీవాల్ యత్నం..

 

నల్లధనాన్ని అరికట్టే చర్యలో భాగంగా మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పలుమార్లు పలు విమర్సలు చేశారు. ఈరోజు కార్యకర్తలతో కలిసి ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాల‌య ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్ర‌మ‌త్త‌మ‌యి వారిని అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర‌ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

కాగా పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై అరవింద్‌ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌మండీ వ‌ద్ద కార్మికులు, వ్యాపారులు, రైతులతో స‌మావేశం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి కూడా పాల్గొన్నారు.