గంధరగోళ పరిస్థితుల మధ్యే రైల్వే బడ్జెట్

 

 

 

లోక్ సభలో గంధరగోళ పరిస్థితుల మధ్యే రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే మధ్యంతర రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్య తొలిసారిగా ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మల్లికార్జున ఖర్గే బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా... కేంద్ర మంత్రులు కావూరి, పురంధేశ్వరి, పల్లంరాజు, చిరంజీవి వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలుపగా, కిల్లీకృపారాణి, కిషోర్‌చంద్రదేవ్ తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలియజేశారు.

 

మధ్యంతర రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:

#. ఖద్రా-వైష్ణోదేవి మధ్య ప్రారంభానికి సిద్ధమైన రైలు మార్గం
#. తూర్పు - పశ్చిమ రైల్వేలో రెండు ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు
#. 2702 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు
#. మరో 4 వేల 500 కిలోమీటర్ల రైల్వే లైను విద్యుతీకరణ
#. కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
#. కాచీగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
#. గుంటూరు - కాచీగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
#. హైదరాబాద్- గుల్బర్గాల మధ్య ఇంటర్ సింటి ఎక్స్‌ప్రెస్
#. మరో 4 వేల 500 కిలోమీటర్ల రైల్వే లైను విద్యుతీకరణ