హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఇండిపెండంట్లతో వచ్చిన చిక్కు...

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలలో ఇప్పుడు ఓ భయం పట్టుకొంది, ఇరవై నాలుగు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్ బ్యాంక్ దెబ్బతీస్తారో అని ప్రధాన పార్టీలు ఆంధోళన  చెందుతున్నాయి. వీరి వల్ల ఎవరికి నష్టం కలుగుతోందని లెక్కల వేసే పనిలో పడ్డాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది. నామినేషన్ ల తిరస్కరణ, ఉపసంహరణ తర్వాత ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఇరవై నాలుగు మంది ఇండిపెండెట్లు, ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

తమ తమ ఓటు బ్యాంకులను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి, హుజూర్ నగర్ లో మొదటి సారి పాగా వేయాలనే లక్ష్యంతో అధికార టీ.ఆర్.ఎస్ పనిచేస్తుంది. విపక్ష కాంగ్రెస్ మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. బీజేపీ సరి కొత్త ఎత్తుగడతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. గత ఎనికల్లో కాంగ్రెస్ తో జత కట్టిన టిడిపి ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. ఉప ఎన్నిక బరిలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులుంటే వీరిలో ఇరవై నాలుగు మంది ఇండిపెండెంట్ లు ఎవరి ఓటు బాంకును చీలుస్తారో అనే భయం ప్రధాన పార్టీలకు పట్టుకుంది. ఇండిపెండెట్ల వల్ల కలిగే నష్టం తమపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది అని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి.

ఏ అభ్యర్థి వల్ల తమకు ఎక్కువ నష్టం జరుగుతుందో అని కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ లెక్కలతో విశ్లేషణ మొదలుపెట్టాయి. తమకు నష్టం కలిగించే స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించే పని జోరుగా చేపట్టాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులతో తమకేం నష్టం లేదని టి.ఆర్.ఎస్ అంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఇండిపెండెంట్ల ప్రభావం అధికార పార్టీ పైనే ఉంటుందనేది కాంగ్రెస్ నేతల విశ్లేషణ. ఎవరెన్ని లెక్కలేసుకున్న ఇండిపెండెంట్లు మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు.