ఎన్టీఆర్ 'బాద్ షా' కి డబ్బింగ్ చెబుతున్న మహేష్
posted on Mar 23, 2013 12:24PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసందే. ప్రిన్స్ మహేష్ 'బాద్ షా' కు డబ్బింగ్ ను మొదలు పెట్టారు. వాయిస్ ఓవర్ లో మహేష్ మంచి డైలాగ్స్ కూడా చెప్పారని తెలుస్తోంది. 'బాద్ షా' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 5న రికార్డ్ ధియేటర్ లలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డైరెక్టర్ శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గ కూడదని ఎంతో కసితో ఈ స్క్రిప్ట్ కోసం పని చేసారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ఎస్.ఎస్ తమన్ సంగీతం అంది౦చారు.