రెండు సీట్లు తగ్గినా సరేనన్న టీడీపీ, టీజేఎస్..!!

 

ఎట్టకేలకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు టీడీపీకి 15 సీట్లు, టీజేఎస్ కి 10, సీపీఐకి 4 సీట్లు కేటాయించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం టీడీపీకి 13, టీజేఎస్ కి 8, సీపీఐకి 4 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను ప్రకటిద్దామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు టీడీపీ, టీజేఎస్, సీపీఐ అంగీకరించినట్లు సమాచారం. తమకు సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యం అని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపుపై రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.