వీరు రోగులు కాదు... మ‌ద‌ర‌సాలో ఆక‌లితో అలా చేస్తున్నార‌ట‌!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోకు సంబంధించిన అస‌లు వాస్త‌వాలు ఏమిటి?  నిజంగా ప్లేట్‌లు, చెంచాలు నాకుతున్న వీరికి క‌రోనా పాజిటివ్ వుందా? ఎందుకు వీరు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు? 

మ‌నం ఇప్పుడు ఒక మ‌ద‌ర‌సాను చూద్దాం. ఎంత దారుణంగా ఇక్క‌డ పిల్ల‌లు వుంటున్నారో చూడండి. చందా డ‌బ్బుల‌తో మ‌ద‌ర‌సా నిర్మాణం అయితే చేశాడు కానీ లోప‌ల క‌నీస వ‌స‌తులు లేవు. ఇలాంటి దృశ్యాలు చూపించి ఎన్ని సార్లు ఎంత మంది ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు వ‌సూలు చేసుకున్నాడో మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుడు ఆ దేవుడికే తెలుసు. 

కానీ పిల్ల‌లు దుర్భ‌ర‌మైన బ్ర‌తుకు బ‌తుకుతున్నారిక్క‌డ‌. క‌నీసం నేల‌పై ప‌రుచుకోవ‌డానికి ఎలాంటి దుప్ప‌టి లేదు. ఇక్క‌డ క‌నిపిస్తున్న‌ పిల్ల‌లే వారి వారి ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్ప‌ట్లు అవి. పిల్ల‌లే ఊడ్చుకోవాలి. పిల్ల‌లే క‌డిగి శుభ్రం చేసుకోవాలి. కానీ ఎంత మంది పిల్ల‌లు చేస్తారు. అందుకే అక్క‌డ వ‌స్తున్న దుర్వాస భ‌రించ‌లేకుండా వుంద‌ని, ఈ పిల్ల‌లు ఎలా వుంటున్నార‌ని అనిపిస్తోంది క‌దూ! అవును వారి పేద‌రిక‌మే ఇక్క‌డ‌కు చేర్చింది. అంతే. వేరే క‌థే లేదు. ముస్లింల‌లో వున్న క‌టిక దారిద్ర‌మే. డ‌బ్బున్న ముస్లింలు జ‌కాత్ రూపంలో చందా ఇచ్చినా ఈ పేద పిల్ల‌ల‌కు ఎంత వ‌ర‌కు చేరుతుందో దేవుడికే తెలియాలి. కానీ మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు మాత్ర‌మే స‌మాజంలో పెద్ద‌మ‌నుషులే. వారికి మంచి హోదా, గౌర‌వం కూడా వుంటుంది. వాళ్ళు నిర్వ‌హించే మ‌ద‌ర‌సా ఎలా వుంటుందంటే మ‌నం చూస్తున్న వీడియోనే  అద్దం ప‌డుతుంది.

ఈ వీడియోలో క‌నిపిస్తున్న దృశ్యాలు మ‌ద‌ర‌సాకు సంబంధించిన‌వి! అయితే మ‌ద‌ర‌సాలో ఈ పిల్ల‌లు ఎందుకు ప్లేట్లు నాకుతున్నారు? దారుణ‌మైన విష‌యం ఏమిటంటే ఆక‌లి వీరితో ఆలా చేయించింది. అవును. నిజ‌మే. అస‌లు మ‌ద‌ర‌సాలో ఎందుకు చేరుతున్నారు?  కేవ‌లం ఆక‌లి తీర్చుకోవ‌డానికే అనేది క‌ఠిన‌మైన వాస్త‌వం. 

క‌టిక ద‌రిద్రంలో వున్న కుటుంబాల వారి వ‌ద్ద‌కి కొంత మంది మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు వెళ్ళి వారి కుటుంబాల‌కు సంవ‌త్స‌రానికి ప‌ది వేల రూపాయ‌లు ఇచ్చి ఆ పిల్ల‌ల్ని మ‌ద‌రాసాకు తీసుకువ‌స్తారు. ఈ పిల్ల‌ల్నిచూపించి చందాలు వ‌సూలు చేస్తారు. ఒక పిల్ల‌వాడి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కోసం ఎంత మంది దాత‌లు దొరికితే అంత మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు చందా రూపంలో తీసుకొని ఆ మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుడి సొమ్ములు చేసుకుంటాడు. క‌నీసం ఈ పేద పిల్ల‌ల‌కు క‌డుపునిండా అన్నం పెట్ట‌డు. శుభ్ర‌త కోసం అవ‌స‌ర‌మైన నీళ్ళు ఇవ్వడు. అంతా పొదుపు పాటించేలా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తాడు మ‌ద‌ర‌సాలో. ఆ ప్లేట్లు క‌డ‌గ‌కుండా మొత్తం నాకీ పెట్టుకుంటారు. మ‌ళ్లీ అదే ప్లేటు వాడే స‌న్నివేశాలు కొన్ని మ‌ద‌ర‌సాల్లో క‌నిపిస్తాయి. ఇక్క‌డ జ‌రిగిందేమిటంటే ఆ రోజు మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు కొంత మంది దాత‌ల్ని పిలిచి విందు ఇచ్చాడ‌ట‌. మంచి భోజ‌నం, స్వీట్లు తిన్న‌ దాత‌లు భారీ ఎత్తునే చందా ఇచ్చార‌ట‌. అయితే మ‌ద‌ర‌సాలో ఆక‌లితో వున్న పిల్ల‌ల‌కు ఆ రోజు స‌రిప‌డ భోజ‌నం దొర‌క‌లేద‌ట‌. ఏం చేస్తారు. స్వీట్‌కు సంబంధించిన పంచ‌దార‌ పాకం ఆ ప్లేట్‌ల‌కు చెంచాల‌కు అంటి వుండ‌టంతో ఆ పిల్ల‌లు అలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తేలింది.

నిరుపేద ముస్లింల అక్ష‌రాస్య‌త‌కు, ఆకలి తీర్చుకోవ‌డానికి మ‌ద‌ర‌సాలు కొంత ఉప‌యోగ‌ప‌డుతున్నా కేవ‌లం ఇక్క‌డ  మతపరమైన బోధనా కొనసాగుతోంది. మదరసా విద్య లో ఆధునిక విద్యా ప్రణాళిక  లేకపోవడంతో, ముస్లింలు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పోటీ చేయలేక మ‌ద‌ర‌సా నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వ్య‌క్తి తాను మ‌రో మ‌ద‌ర‌సా స్థాపించి చందాల‌పైనే ఆధార‌ప‌డే వ్య‌వ‌స్థ త‌యారైంది. ముస్లింలు ఖ‌ర్చుపెడుతున్న జ‌కాత్ ఇలా మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుల జేబుల్లోకి వెళ్తుంద‌నే విమ‌ర్శులున్నాయి.