150 ఏళ్ల తరువాత మళ్ళీ ఆకాశంలో అద్భుతం!!

 

జులై 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తరాషాడ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. మంగళవారం రాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.29 గంటల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మరో విశేషముంది. దాదాపు 150 ఏళ్ల తర్వాత గురు పౌర్ణమి రోజున ఈ గ్రహణం రావడం మరో విశేషం.

ఈనెల 16న గురు పౌర్ణమి. వేదవ్యాసుని జయంతికి గుర్తుగా గురు పౌర్ణమి జరుపుకొంటారు. 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు 149 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం వస్తుంది. 16వ తేదీ తెల్లవారుజామున 1.30 నుంచి మొదలై సాయంత్రం 4 గంటల వరకు గురుపౌర్ణమి ఘడియలు ఉన్నాయి. రాత్రి 1.30 గంటల నుంచి 17వ తేదీ తెల్లవారుజామున 4.29 వరకు చంద్రగ్రహణం ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా కేవలం 8 గంటలు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే రెండు సందర్భాలు రావడం అరుదు. ఈ అరుదైన, అద్భుత సన్నివేశం రేపు కనిపించనుంది.