లోక్ సభ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ

లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2015-16 సాధారణ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభల్లో ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు 9 నెలల్లో ఎన్నో చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 2015 సంవత్సరం సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తాం, ఆర్ధికాభివృద్ధి లో రాష్ట్రాల పాత్ర కీలకం, ప్రజలు వెచ్చించే ప్రతి పైసా సక్రమంగా ఖర్చు పెడతామని వివరించారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. అంతకముందు సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దయం 10 గంటల సమయంలోనే ప్రధాని మోడీ, అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు చేరుకున్నారు.