నా బిడ్డ మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తాడు: మోడీ మాత‌ృమూర్తి

 

నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ స్పందించారు. నరేంద్రమోడీ విజయం సాధిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సంబరాలను నరేంద్రమోడీ తల్లి టీవీలో చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ‘‘నా బిడ్డకి నా ఆశీస్సులు వున్నాయి. నా బిడ్డ నరేంద్రమోడీ దేశాన్ని అభివ‌ద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాడు’ అని ఆమె వ్యాఖ్యానించారు.