పాపం పండింది

 

 

 

మనదేశంతో పోలిస్తే అవినీతి విషయంలో అన్ని దేశాలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి.. ముఖ్యంగా చైనా లాంటి దేశాలలో ఎంత వారకైనా తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారు.. ఆఖరికి మంత్రి స్థాయి వారికి కూడా మరణ శిక్ష విదించి సంచలనం సృష్టించింది చైనా.25 ఏళ్ల రాజకీయ జీవితంలో 65 కోట్ల అవినీతి పాల్పడ్డ మాజీ మంత్రికి... అక్కడి కోర్టు ఏకంగా మరణశిక్ష విధించింది. అవినీతి సొమ్ముతో అతను సంపాందించిన సొత్తును స్వాదీనం చేసుకుంది..

 

లియు ఝిజున్‌. చైనా మాజీ రైల్వే మంత్రి. దేశంలోనే అత్యధికంగా 8 ఏళ్ల పాటు రైల్వే మినిస్టర్‌ గా పని చేసి రికార్డ్ సృష్టించిన వ్యక్తి. దాదాపు 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఐతే దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా... మంత్రిగా ఉండగానే చేతివాటం చూపించాడు. దాదాపు 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు.



కరెప్షన్ వ్యవహారంలో ఇదీ చైనా వైఖరి. దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు... 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితినే సహించలేదు. చైనా రైల్వే రంగంలో ఎన్నో సంస్కరణలకు కారణమైన లియు ను పాపం పోనీ అనలేదు. దేశ సంపద దుర్వినియోగం చేస్తే ఎవరినీ క్షమించేదీ లేదని ఈ సంఘటన ద్వారా మిగతా నాయకులకు హెచ్చరికలు పంపింది.



కాని మనదేశంలో మాత్రం ఇలాంటి సంఘటనలు మచ్చుకు కూడా కనిపించవు.. వేల కోట్ల అవినీతి ఆరోపణలతో కంపు కొట్టే మన రాజకీయపార్టీల నేతలకు అసలు అలాంటి భయమన్నదే లేదు.. మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకున్న నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.

.

మన దేశంలో కూడా చైనాలో జరిగిన లాంటి సంఘటన ఒక్కటి జరిగితే చాలు.. ఒక్క అవినీతి నాయకునికి శిక్ష పడినా దేశంలో కొంత మంది అయినా మారతారు..


మరీ అవినీతి కుంభకోణాలతో భ్రష్టు పట్టిన మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేల కోట్ల రూపాయల జాతి సంపద దోచుకున్న నాయకులు దర్జాగా చట్టసభల్లో దర్శనిమిస్తున్నారు. కామన్ వెల్త్ స్కాంలో 70 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా... సురేష్ కల్మాడీ ఇంక ఎంపీగా కొనసాగుతున్నారు. పలు క్రీడాల సంఘాల్లో పోటీ చేసే అవకాశంతో పాటు పార్లమెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2జీ స్కాం లో నిందితురాలిగా ఉన్న కరుణానిధి కుమార్తె కనిమొళి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రైల్వే మినిస్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే 10 కోట్ల రూపాయల లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన పవన్ కుమార్ బన్సాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సీబీఐ చార్ఝిషీట్ కనీసం ఈ మంత్రిగారీ పేరు లేదు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులకు ఇప్పటికీ శిక్షపడలేదు. బొగ్గు స్కాం లో వేల కోట్ల జాతి సంపదను మెక్కినా ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతోంది. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఏ నాయకుడి ఆస్తులను ప్రభుత్వం ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించిన దాఖలాలు లేవు.

వాయిస్

అవినీతి విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహారిస్తున్నందునే చైనా సూపర్ పవర్‌ గా ఎదిగింది. ఇకనైనా భారత్ కరెప్షన్ విషయంలో ఉదాసీన వైఖరి మార్చుకోవాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. లేదంటే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.