ఐదువేలకే అదిరిపోయే ట్యాబ్

Publish Date:Jan 15, 2015

 

ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు నేలమీదకి దిగి వస్తూ వుంటాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్లు, ట్యాబ్స్ ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా ట్యాబ్‌ల తయారీ రంగంలో ముందడుగులో వున్న లెనోవో సంస్థ ఒక కొత్త ట్యాబ్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ ట్యాబ్ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం ఐదు వేల రూపాయలే! నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. నిజంగానే ఐదు వేల రూపాయలే..! ఈ ధరలో ట్యాబ్‌ 2 ఎ7-10ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌‌ ద్వారా లభిస్తుంది. స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్‌పై ఈ ట్యాబ్‌ లభిస్తుందని లెవోనో ప్రకటించింది. ఈ ట్యాబ్‌ని ఇటీవల లాస్‌వెగాస్‌లో జరిగిన కన్సూ మర్‌ ఎలక్ట్రానిక్‌ షోలో లెనోవో సంస్థ ప్రదర్శించింది. ఈ ట్యాబ్‌లో మల్టీమీడియా ఫీచర్స్‌ వున్న ఈ ట్యాబ్ బరువు 269 గ్రాములు. ఏడంగుళాల డిస్‌ప్లేతోపాటు 4.4 కిట్‌క్యాట్‌ ఆండ్రాయిడ్‌ వ్యవస్థ, 1.3జిహెచ్‌డ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ వస్తోంది. లెనోవో డూ ఇట్‌ యాప్స్‌, డాల్బీ ఆడియో వ్యవస్థ కూడా వున్నాయి. 1 జీబీ రామ్‌, 8 జీబీ అంతర్గత మెమరీ, వైఫై, బ్లూటూత్‌, 0.3ఫిక్సెడ్‌ ఫోకస్‌కెమేరా, 3450 ఎంఎహెచ్‌ లి-ఇయాన్‌ బ్యాటరీతో వస్తోంది.

By
en-us Political News