కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న లాయర్లు

 

ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని విషయాలు తేల్చడంలో మాత్రం జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.రాయలసీమలో హైకోర్టు ఉద్యమం మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏకంగా జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.విధులకు వెళ్లకుండా కోర్టు గేటుకు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాయర్ లను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెల రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదంటూ భగ్గుమన్నారు న్యాయవాదులు. 

కర్నూలులో హైకోర్టును  ఏర్పాటు చేయాలంటూ గత ముప్పై మూడు రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కోర్టులు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజూ కూడా లాయర్ లందరూ కూడా విధులకు హాజరు కానీ సంధర్బాలు లేవు. ఈ రోజునుంచి ఏకంగా స్టాఫ్ కానీ జిల్లా జడ్జిలు కానీ ఎవ్వరూ కూడా కోర్టుకు హాజరు కాకుండా ఏకంగా కోర్టులకు తాళాలు వేశారు. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న సంధర్బంలో కచ్చితంగా హై కోర్టుని ఏర్పాటు చేయలనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలసిందేనని డిమాండ్ ఉధృతం అవుతుంది.దీనిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తులు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచి చూడాలి.