హంగ్‌ పై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

posted on: Dec 1, 2018 9:24AM

 

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్టోప్‌సగా పేరున్న లగడపాటి రాజగోపాల్‌ సర్వే ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. నారాయణపేటలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి, బోధ్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అనిల్‌ జాదవ్‌ గెలుస్తారని చెప్పిన రాజగోపాల్..రోజుకి ఇద్దరి పేర్ల చొప్పున ప్రకటిస్తా అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హంగ్‌ పై స్పందించారు. "మా అంచనా ప్రకారం తెలంగాణలో ఎక్కువ 8 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తున్నట్లు తేలింది. 10 సీట్లు (స్వతంత్రులకు) పోయినా పార్టీలు ఇంకా 109 సీట్లలో చూసుకోవచ్చు. ‘హంగ్‌ అసెంబ్లీ’ అనే ముచ్చటే లేదు. ఇండిపెండెంట్లు ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావు. ప్రజా కూటమిగానీ, టీఆరెస్ఎస్ గానీ స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి" అని వెల్లడించారు.

మరోవైపు "మా బృందం ఆగస్టులో ఒక టీవీ చానెల్‌ కోసం సర్వే చేసింది. అప్పుడు విడుదల చేసిన సర్వే టీఆర్ఎస్ కు అనుకూలంగానే వచ్చింది. సంవత్సరం, ఆరు నెలల ముందుగానే సర్వే చేస్తే ఎలా నిరూపిస్తావన్న ఆరోపణలు వస్తాయి. ఆగస్టులో పరిస్థితిని నేను విశ్లేషించలేదు. అప్పటి డేటాను పరిశీలిస్తూనే ఇప్పుడు వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నాను" అని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వివరాలు చెప్పమంటే చెప్పగలను. 3 నెలల ముందు ఫలితాల గురించి చెప్పమంటే చెప్పలేను. డిసెంబరు ఏడో తేదీ సాయంత్రం సర్వే ఫలితాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...